Mon Dec 23 2024 13:14:21 GMT+0000 (Coordinated Universal Time)
భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు : పోలీసుల బందోబస్తు
ఢిల్లీలో కవిత నివాసానికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో కవిత నివాసానికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుటకు ఈరోజు హాజరుకానుండటంతో ఆమెకు సంఘీభావం తెలిపేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు పెద్దయెత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో కవిత బసచేశారు. అక్కడికి ఈడీ కార్యాలయం దగ్గర కావడంతో ఆమె అక్కడి నుంచే ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.
కవిత ఇంటివద్దకు...
మంత్రి హరీశ్‌రావు కవిత ఇంటికి చేరుకుని చర్చిస్తున్నారు. తెలంగాణ అడిషన్ అడ్వకేట్ జనరల్ కూడా కవిత నివాసానికి చేరుకుని న్యాయ సలహాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద 144వ సెక్షన్ ను విధించారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరినీ ఈడీ కార్యాలయం వైపునకు రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. కవిత న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం ఈడీ కార్యాలయానికి బయలుదేరనున్నారు.
Next Story