Mon Dec 23 2024 09:21:20 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీర్పు రిజర్వ్
బీఆర్ఎస్ గుర్తుపై కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పిటీషన్ వేసింది.
వాదనలు ముగిసి...
దీనిపై హైకోర్టులో ఇరువర్గాల వాదన వినింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఇటు బీఆర్ఎస్ అటు అధికార పక్షాలు తమ వాదనలను బలంగా వినిపించాయి. ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించలేమని అడ్వొకేట్ జనరల్ వాదించారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని వారి తరుపున న్యాయవాదులు కోరారు. దీనిపై రెండు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చెప్పింది.
Next Story