Sun Dec 22 2024 21:25:31 GMT+0000 (Coordinated Universal Time)
Income Tax : మిర్యాలగూడలో ఐటీ సోదాలు
బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు అనుచరుల ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు అనుచరులు ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్క నల్లగొండలోనే ముప్ఫయి బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థిగా నల్లమోతు భాస్కరరావు బంధువులు, అనుచరుల ఇళ్లపై ఈ సోదాలు జరుగుతున్నాయి. కేంద్ర బలగాల పహారా మధ్య ఈ సోదాలు జరుగుతున్నాయి.
నగదు ఉందని...
పెద్దయెత్తున నగదు ఉందన్న సమాచారంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారు జాము నుంచే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల కోసం భారీ ఎత్తున నగదును నిల్వ చేసినట్లు సమాచారం రావడంతోనే ఈ తనిఖీలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. రైస్ మిల్లులతో పాటు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లోకూడా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే తన ఇళ్లలో ఎటువంటి సోదాలు జరగడం లేదని భాస్కర్ రావు తెలిపారు.
Next Story