Mon Dec 15 2025 00:25:00 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్ మాత్రం గులాబీమయమే?
హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు

హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనపరుస్తున్నారు. ఇక్కడ అతి తక్కువ ఓట్లు పోలవ్వడంతో పాటు అభివృద్ధి పట్ల జనం ఆకర్సితులయ్యారని చెప్పాలి. హైదరాబాద్ నగరంలో బీజేపీ మాత్రం అనుకున్న స్థాయిలో తన పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది.
గ్రేటర్ హైదరాబాద్ లో ...
గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీమయంగా కనిపిస్తుంది. చివరకు బీజేపీ గెలుస్తుందని భావించినా అక్కడ కమలం పార్టీ అభ్యర్థి రాజాసింగ్ వెనుకబడి ఉన్నారు. గోషామహల్ లో రాజాసింగ్ మూడో సారి కూడా గెలుస్తారని అనుకున్నారు. కానీ ఆయన వెనుకంజలో ఉండటంతో హైదరాబాద్ సిటీలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభావం పెద్దగా కనిపించకపోవడం విశేషం.
Next Story

