Thu Dec 26 2024 00:56:16 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్
వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు
వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం హన్మకొండ జడ్పీ ఛైర్మన్ గా సుధీర్ కుమార్ ఉన్నారు. రానున్న ఎన్నికల్లో వరంగల్ నుంచి బీఆర్ఎస్ తరుపున మారేపల్లి సుధీర్ కుమార్ పోటీ చేయనున్నారు.
హన్మకొండ జడ్పీ ఛైర్మన్
తొలుత కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించినా ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లారు. అయితే ఈరోజు మాజీ మంత్రి రాజయ్యను తన ఫాం హౌస్ కు పిలిపించుకోవడంతో ఆయనకు టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే చివరకు కేసీఆర్ మాత్రం మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుధీర్ కుమార్ పేరును అధికారికంగా ప్రకటించారు.
Next Story