Sun Dec 22 2024 21:15:35 GMT+0000 (Coordinated Universal Time)
BRS : ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ చీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆయన నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన చర్చిస్తున్నారు. వరస బెట్టి ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో ఆయన అత్యవసరంగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
అందుబాటులో ఉన్న...
అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. వారితో కేసీఆర్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. కేవలం నాలుగున్నరేళ్లకు ఆశపడి బయటకు వెళ్లవద్దని వారికి సూచించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో కొనసాగితే భవిష్యత్ ఉంటుందని ఆయన భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ప్రచారం జోరుగా సాగుతుండటంతో అత్యవసరం ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిసింది.
Next Story