Fri Dec 20 2024 22:44:12 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సిద్ధిపేట, సిరిసిల్లకు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరస పర్యటనలు చేస్తున్నారు. నేడు సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరస పర్యటనలు చేస్తున్నారు. పార్టీ అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా మ్యానిఫేస్టోను కూడా ప్రజలముందుంచి ఆయన జిల్లాలకు బయలుదేరారు. ఇప్పటికే హుస్నాబాద్, జనగామ, భువనగిరి సభల్లో ప్రసంగించిన కేసీఆర్ ఈరోజు సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని, మరోసారి అవకాశమివ్వాలంటూ కేసీఆర్ ప్రజలను కోరనున్నారు.
రెండు సభల్లో...
సిద్ధిపేటలో మేనల్లుడు హరీశ్ రావు, సిరిసిల్లకు తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా వీరి నియోజకవర్గాల్లో పర్యటించిన తర్వాతే మిగిలిన ప్రాంతాలకు వెళ్లాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. అప్పుడే వాళ్లిద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి వీలవుతుందన్న అభిప్రాయంతోనే కేసీఆర్ మూడో రోజే ఈ రెండు చోట్ల పర్యటనలు పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు చోట్ల భారీ జన సమీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Next Story