Sun Dec 22 2024 12:03:59 GMT+0000 (Coordinated Universal Time)
KCR : ఎగ్జిట్ పోల్స్ పై కేసీఆర్ ఏమన్నారంటే?
నిన్న విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు
నిన్న విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ఎగ్జిట్ పోల్స్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు.ఎక్కువ వస్తే పొంగిపోయేది లేదని, తక్కువ వస్తే కుంగిపోయేది లేదని వెల్లడించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం అంతా గోల్ మాల్ అని అన్న కేసీఆర్, ఒకరు బీఆర్ఎస్ కు పదకొండు సీట్లు వస్తాయన్నారని, ఇంకొకరుఅసలు రావని చెప్పాడన్నారు. అయితే వేటినీ పట్టించుకోవాల్సిన అవసరంలేదని అన్నారు.
ఖచ్చితంగా మెరుగైన ఫలితాలే...
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మెరుగైన ఫలితాలే వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన బస్సు యాత్రకు విశేషంగా ప్రజాస్పందన వచ్చిందని, దాన్ని బట్టి తమకు మంచి ఫలితాలే రావాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం... ఎన్ని వచ్చినా బాధ లేదు... 11 సీట్లు వస్తే పొంగిపోయేది లేదు, రెండో మూడో వస్తే కుంగిపోయేది లేదు. ఎది ఎలా ఉన్నా తెలంగాణకు రక్షణ కవచం అంటే అది బీఆర్ఎస్ పార్టీనే నంటూ ఆయన అన్నారు. రాజకీయ ఫలితాలు వస్తుంటాయి, పోతుంటాయి... ఈ పార్లమెంటు ఎన్నికలు కూడా అంతేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Next Story