Sun Apr 13 2025 10:32:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పాలమూరు జిల్లాకు కేసీఆర్
నేటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు

నేటి నుంచి బీఆర్ఎస్ అధినేత జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. దసరా పండగకు కొంత గ్యాప్ ఇచ్చిన కేసీఆర్ తిరిగి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. ఈరోజు కేసీఆర్ నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. మామూలుగా అయితే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాని కొన్ని కారణాలతో దానిని వాయిదా వేసుకున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు గులాబీ పార్టీ నేతలు చేస్తున్నారు.
వరస సభలతో...
కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కేసీఆర్ ప్రచారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్కు అధికారమిస్తే మూడు గంటలే కరెంట్ వస్తుందని, ధరణి పోర్టల్ ను తీసేస్తారంటూ ఆయన ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోవాలంటే మూడోసారి బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని కోరుతున్నారు. రోజుకు రెండు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ అభ్యర్థులను పరిచయం చేస్తూ గెలిపించాలని కోరుతున్నారు. మధ్యాహ్నం నుంచి కేసీఆర్ సభలు ప్రారంభం కానున్నాయి.
Next Story