Sun Mar 30 2025 10:35:14 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు నేతలతో కేసీఆర్ కీలక సమావేశం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ నేతలతో చర్చించనున్నారు. బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక స్థానాన్ని సులువుగా కైవసం చేసుకుంటుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో...
అయితే ఇద్దరి చేత నామినేషన్లు వేయించాలని బీఆర్ఎస్ ఆలోచిస్తుంది. బలం లేకపోయినా అధికార పార్టీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పాటు తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి పోయిన ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేసి సాంకేతికంగా తమకు సాక్ష్యం తీసుకోవాలని భావిస్తుంది. ఇందుకోసమే నేడు కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో పోటీ ఎన్ని స్థానాలు, ఎవరిని నిలబెట్టాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story