Mon Dec 23 2024 08:01:49 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు మూడు చోట్ల కేసీఆర్ సభలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు మూడు సభల్లో ప్రసంగించనున్నారు. మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు మూడు సభల్లో ప్రసంగించనున్నారు. మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేడు ఆ పర్యటన కొనసాగుతుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో బీఆర్ఎస్ అధినేత తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ప్రచారంలోనూ తనదే పైచేయి అనిపించుకునేలా ముందుకు వెళుతున్నారు. అందరికంటే ముందుగా ప్రజలను కలుసుకుని తమకు మరోసారి అవకాశమివ్వాలని కోరుతున్నారు.
నల్లగొండ జిల్లాలో...
ఈరోజు నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండల్లో జరగనున్న బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల పేరుతో సుడిగాల పర్యటనలు చేస్తున్న కేసీఆర్ విపక్షాల కంటే ఒక అడుగు ముందు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున పర్యటిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమాయానికే దాదాపు సగం నియోజకవర్గాలను కవర్ చేయడమే లక్ష్యంగా ఆయన పెట్టుకున్నట్లు కనపడుతుంది.
Next Story