Sun Dec 22 2024 18:58:47 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు నల్లగొండలో కేసీఆర్ సభ
ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లగొండకు రానున్నారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు
ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లగొండకు రానున్నారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో ఈ సభ ఏర్పాటు చేశారు. సభను మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. రైతు గర్జన పేరుతో బీఆర్ఎస్ ఈ సభను నిర్వహిస్తుంది.
ప్రాజెక్టులను అప్పగింతపై...
కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగిస్తున్న వైఖరిని ఎండగడుతూ ఈ సభను నిర్వహిస్తున్నారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పగింతతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారు. దీంతో కేసీఆర్ పార్టీ ఓటమి తర్వాత జరిగే నల్లగొండ సభలో ఏం మాట్లాడతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సభకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story