Tue Apr 01 2025 22:04:27 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు కేసీఆర్ మలివిడత పొలంబాట
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మలివిడత పర్యటనకు నేడు బయలుదేరనున్నారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మలివిడత పర్యటనకు నేడు బయలుదేరనున్నారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించననున్నారు. బోయినిపల్లి మండలం కొదురుపాక వద్ద ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్టును కూడా కేసీఆర్ పరిశీలిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సిరిసిల్ల జిల్లాలో...
మిడ్ మానేరు ప్రాజెక్టులో నీళ్లు లేకుండా ఉన్న పరిస్థితిపై స్వయంగా ఆయన పరిశీలించి అనంతరం సిరిసిల్లలోని బీఆర్ఎస్ పార్టీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాతో పాటు జనగామ, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈరోజు సిరిసిల్ల జిల్లాలో ఆయన పర్యటించనున్నారు.
Next Story