Mon Dec 23 2024 03:05:09 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భభవన్ లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భభవన్ లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు ఆయన వస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. క్యాడర్ లో జోష్ నింపేందుకు నేతలు సమాయత్తం కావాలని ఆయన వారికి ఉద్భోదించనున్నారు.
నేతలకు దిశా నిర్దేశం...
నిరాశ చెందాల్సిన పనిలేదని, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలయిందని, దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేలా అందరూ కష్టపడి పనిచేయాలని కేసీఆర్ నేతలకు హిత బోధ చేయనున్నారు. యాక్టివ్ గా లేని నేతలను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తానని కూడా ఆయన హెచ్చరించే అవకాశాలున్నాయి. కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు వస్తుండటంతో నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story