Mon Dec 23 2024 07:48:26 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు నాలుగు సభల్లో కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు నాలుగు సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు నాలుగు సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటున్నారు. తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కారు పార్టీ అధినేత స్పీడ్ పెంచారు. గత కొద్ది రోజులుగా వరసగా జిల్లాలను చుట్టివస్తూ నియోజకవర్గాల్లో ప్రజలను తమను మరోసారి గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుచుకుపడుతున్నారు. మరోసారి వస్తే తాము ఏం ఏం పథకాలు అమలు చేస్తున్నామో చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాలు కొన్ని రద్దు అయ్యే అవకాశముందని కూడా చెబుతున్నారు.
మూడు జిల్లాల్లో...
ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాల్ నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఈ సభలు ప్రారంభం కానున్నాయి. పెద్దయెత్తున జనసమీకరణ చేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు.
Next Story