Sat Dec 21 2024 07:49:09 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేటి నుంచి జనంలోకి కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేటి నుంచి బస్సు యాత్రతో జనం బాట పట్టనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేటి నుంచి బస్సు యాత్రతో జనం బాట పట్టనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వరసగా పదిహేడు రోజుల పాటు ఆయన నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. రోడ్ షోలతో పాటు బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రజలను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయన బస్సు యాత్రకు నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు.
రోడ్ షోలతో...
రాత్రికి జిల్లా కేంద్రాల్లోనే బస చేయనున్నారు. ఈరోజు మిర్యాలగూడ, సూర్యాపేట లో జరిగిే రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం పార్టీ కార్యాలయం నుంచి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకుని అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు చేరుకుంటారు. రోడ్ షో చేసిన అనంతరం రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
Next Story