Sun Apr 13 2025 20:17:05 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు ఖమ్మం జిల్లాకు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి వరసగా కేసీఆర్ బస్సుయాత్రతో తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోల ద్వారా కేసీఆర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
అత్యధిక స్థానాలను...
తెలంగాణలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించే దిశగా ఆయన ప్రయత్నాలుచేస్తున్నారు. పన్నెండు స్థానాలను సాధించే దిశగా ఆయన ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామానాగేశ్వరరావుకు మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఈరోజు తల్లాడ, జూలూరుపాడు, కొత్తగూడెం ప్రాంతాల మీదుగా కేసీఆర్ బస్సుయాత్ర జరగనుంది.
Next Story