Mon Dec 23 2024 04:20:44 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు మంచిర్యాలలో కేసీఆర్ రోడ్ షో
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. గత నెల 24వ తేదీన బస్సు యాత్రతో లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతో బయలుదేరిన కేసీఆర్ కు ఎన్నికల కమిషన్ ప్రచారంపై నిషేధం విధించడంతో రెండు రోజుల పాటు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి నిన్న రాత్రి నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు.
అభ్యర్థులకు మద్దతుగా...
ఈరోజు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరాస్తాలోని సాయంత్రం ఆరు గంటలకు ఈ రోడ్ షో ప్రారంభం కానుంది. అనంతరం జరిగే కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొననున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
Next Story