Tue Dec 17 2024 06:41:30 GMT+0000 (Coordinated Universal Time)
BRS : క్షేత్రస్థాయికి కేసీఆర్.. వారితో మాట్లాడుతూ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. రైతులకు అండగా నిలిచేందుకు ఆయన సిద్ధమయ్యారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. రైతులకు అండగా నిలిచేందుకు ఆయన సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లా నుంచి ఆయన పర్యటనలు ప్రారంభమవుతాయి. రైతుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు కేసీఆర్ పర్యటించనున్నారు. దీనికి పొలం బాట అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు లేక ఎండిపోయిన పొలాలను కూడా పరిశీలించనున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిసింది.
ఎండిపోయిన పంటలు...
పంటలు ఎండిపోవడంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలతో పంట నష్ట పోయిన రైతులను కూడా ఆయన పరామర్శించనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నల్లగొండ నుంచి ప్రారంభయ్యే ఈ యాత్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని తెలిపారు. రైతులకు భరోసా కల్పిస్తూ, తమ ప్రభుత్వ హయాంలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఎన్నడూ రాని విషయాన్ని ఆయన రైతులకు గుర్తు చేయనున్నారు. భువనగిరి పార్లమెంటు నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర కోసం బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story