Mon Dec 23 2024 04:38:54 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు వరంగల్ కు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సు యాత్రతో జనంలోకి వెళుతున్న నేపథ్యంలో నేడు బస్సు యాత్ర వరంగల్ కు చేరుకోనుంది. హనుమకొండ చౌరస్తాలో జరిగే కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొంటారు. వరంగల్ లోక్ సభ అభ్యర్థి సుధీర్ కుమార్ కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
రోడ్ షోల ద్వారా...
సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్ కు చేరుకోనున్న కేసీఆర్ నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి బస్సులో అదాలత్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, పెట్రోలు పంపు జంక్షన్ మీదుగా హనుమకొండ చౌరస్తాకు చేరుకుని అక్కడ సభలో ప్రసంగించనున్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు మంచి స్పందన లభిస్తుండటంతో క్యాడర్, నేతల్లోనూ ఉత్సాహం నెలకొంది.
Next Story