Fri Dec 20 2024 11:45:48 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు కేసీఆర్ పుట్టిన రోజు..70వ ఏట
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు జరుపుకుంటున్నాయి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు జరుపుకుంటున్నాయి. నేటితో 70వ సంవత్సరంలోకి కేసీఆర్ అడుగు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా, తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ సారధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి పాలయింది.
రాష్ట్ర వ్యాప్తంగా...
ఇటీవలే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నల్లగొండ సభలో పాల్గొన్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాలతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరికొన్ని సహాయక కార్యక్రమాలను చేపట్టనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Next Story