Sun Dec 22 2024 17:57:10 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేటితో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సిద్ధిపేటలో జరిగే బహిరంగ సభతో ప్రచారాన్ని ముగించనున్నారు.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సిద్ధిపేటలో జరిగే బహిరంగ సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయం ఉన్నప్టటికీ ముందుగానే ఆయన ప్రచారాన్ని ముగించనున్నారు. గత నెల 24వ తేదీన కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో పర్యటించారు. సిద్ధిపేటలో లక్షలాది మంది పాల్గొనేలా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బహిరంగ సభతో కేసీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.
గత నెల 24వ తేదీన....
రాత్రికి నియోజకవర్గాల్లోనే బస చేశారు. మధ్యలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 48 గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించడంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. మిగలిన అన్ని రోజుల్లో ఆయన పర్యటనలు సాగాయి. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో కేసీఆర్ హోరెత్తించారు. కేసీఆర్ సభకు ప్రజలు పోటెత్తడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లోనూ ఆత్మవిశ్వాసం కనపడుతుంది. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు.
Next Story