Sun Dec 14 2025 18:20:24 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బీఆర్ఎస్ కు మరో షాక్.. కీలక నేత గుడ్ బై
బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికల వేళ మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు

బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికల వేళ మరో షాక్ తగిలింది. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేశ్ నేత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు ఆయన కొద్ది సేపటి క్రితం పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ను కలిశారు. ఆయన కాంగ్రెస్ లో చేరికపై వేణుగోపాల్ తో చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలసి వెంకటేశ్ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు.
టిక్కెట్ రాదని తెలియడంతో...
ఆయనకు బీఆర్ఎస్ టిక్కెట్ రాదని తేలడంతో పార్టీ మారుతున్నట్లు తెలిసింది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వెంకటేశ్ నేత కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. 2019 నుంచి గులాబీ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వెంకటేశ్ నేత మళ్లీ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.
Next Story

