Mon Dec 23 2024 01:28:19 GMT+0000 (Coordinated Universal Time)
8న బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
ఈ నెల 8న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది
ఈ నెల 8న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన రోజే ఆందోళనలకు పిలుపునిచ్చింది. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. ఎలాంటి వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని బీఆర్ఎస్ తమ శ్రేణులకు పిలుపునిచ్చింది.
మోదీ పర్యటన రోజు...
ఈ నెల 8వ తేదీన హైదరాబాద్కు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను ప్రారంభించడంతో పాటు పరేడ్ గ్రౌండ్స్లో వివిధ ప్రాజెక్టులకు భూమిపూజతో పాటు జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనుంది.
Next Story