Thu Dec 19 2024 14:58:49 GMT+0000 (Coordinated Universal Time)
KTR : పార్టీ నేతలతో కీలక సమావేశం
బీఆర్ఎస్ రానున్న లోక్సభ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. చేవెళ్ళ పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు
బీఆర్ఎస్ పార్టీ రానున్న లోక్సభ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈసారి లోక్సభ ఎన్నికలు ముందుగా వస్తాయని తెలియడంతో ఆ పార్టీ అప్రమత్తమయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయినా లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తుంది. అత్యధికంగా లోక్సభ స్థానాలను సాధించి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ను అగ్రగామిగా నిలపాలని అనుకుంటోంది. అందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు నియోజవకర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల్లో....
ఈరోజు తెలంగాణ భవన్ లో చేవెళ్ళ పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్,కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, పలువురు మాజి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ సాగిస్తున్నారు. గెలుపు కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని కేటీఆర్ నేతలకు సూచించారు.
Next Story