Mon Dec 23 2024 13:25:59 GMT+0000 (Coordinated Universal Time)
ఈడీ కార్యాలయంలోకి కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు. ఉదయం పదకొండు గంటలకు ఆమె కేసీఆర్ నివాసం నుంచి బయలుదేరి ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ ఈడీ ఆఫీసులోకి వెళ్లారు కవిత. ఈడీ ఆఫీసు గేటు వరకూ మంత్రులు శ్రీనివాసగౌడ్ తో పాటు బీఆర్ఎస్ నేతలు వచ్చి ఆమెను లోపలికి పంపేవరకూ ఉన్నారు.
భారీ భద్రత...
ఈ సందర్భంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసు వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మనీశ్ సిసోడియా, పిళ్లై, కవిత విచారణ నేపథ్యంలో ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఈడీ ఆఫీసు వద్దకు మీడియాను పోలీసులు అనుమతించడం లేదు. ప్రధాన రోడ్డు వరకే మీడియాను పరిమితం చేశారు. ఢిల్లీలోనే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఉన్నారు. సౌత్ గ్రూప్ ఫండింగ్పై కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
Next Story