Mon Dec 23 2024 11:26:20 GMT+0000 (Coordinated Universal Time)
BRS : కడియం మోసగాడు.... నమ్మక ద్రోహి
డెబ్భయి అయిదేళ్ల వయసు వచ్చినా కడియం శ్రీహరి కుట్రలు, కుతంత్రాలను మానుకోలేదని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
డెబ్భయి అయిదేళ్ల వయసు వచ్చినా కడియం శ్రీహరి కుట్రలు, కుతంత్రాలను మానుకోలేదని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను తప్పించి సీటు ఇచ్చినా విశ్వాసం లేదన్నారు. కడియం శ్రీహరి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కులాన్ని అడ్డం పెట్టుకని పబ్బం గడుపుతున్నారన్నారు. ఒక ప్యాకేజీ మాట్లాడుకుని రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారన్నారు.
బ్లాక్ మెయిల్ చేసి...
కడియం శ్రీహరి ఒక నమ్మక ద్రోహి అని అన్నారు. కడియం శ్రీహరి వల్ల ఎందరో నేతలు బలి పశువులయ్యారన్నారు. పార్టీ అగ్రనాయకత్వాన్ని నమ్మించి మోసం చేయడం కడియానికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. గతంలో చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి పదవులు పొందారన్నారు. ఇప్పుడు కూడా తన రాజకీయ భవిష్యత్ కోసం పదేళ్ల నుంచి తనను ఆదరించిన పార్టీని కాదని కాంగ్రెస్ లో చేరుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారంటూ వినయ్ భాస్కర్ కడియంపై ఫైర్ అయ్యారు.
Next Story