Tue Dec 24 2024 00:07:29 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ బర్త్ డే : ఫ్రీ గా 2 కిలోల టమాటాలు
సోమవారం (జులై 24) కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి రెండు కిలోల టమాటా పంపిణీ చేశారు. ఇక్కడే ఒక షరతు ఉంది.
అసలే టమాటా రేటు ఆకాశాన్నంటింది. అందులో ఎవరైనా టమాటలు ఉచితంగా పంచి పెడుతున్నారంటే మహిళలతో పాటు పురుషులు కూడా ఎగబడి అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఈ సంఘటనే వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. శ్రీహరి గతంలో మద్యం బాటిల్స్ పంపిణీ చేసి దేశంలో సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాజనాల శ్రీహరి వినూత్న రీతిలో ఓ పనికి శ్రీకారం చుట్టాడు.
సోమవారం (జులై 24) కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి రెండు కిలోల టమాటా పంపిణీ చేశారు. ఇక్కడే ఒక షరతు ఉంది. కేవలం మహిళలకు మాత్రమే టమాటాలు పంచి పెడతానని ప్రకటించాడు. దీంతో వందలాది మంది మహిళలు టమాటాల కోసం ఎగబడ్డారు. శ్రీహరి వందలాది మంది మహిళలకు రెండు కిలోల టమాటా పంపిణీ చేస్తున్న సమయంలో అక్కడకు పురుషులు కూడా వచ్చి తమకు కూడా టమాటాలు పంచాలంటూ ఆందోళనకు దిగారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ సృష్టిస్తుంది.
Next Story