Fri Nov 22 2024 21:19:44 GMT+0000 (Coordinated Universal Time)
Harish Rao Resignation letter: రాజీనామా లేఖను వారికి ఇచ్చి వెళ్లిన హరీశ్
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తన రాజీనామాతో శుక్రవారం ఉదయం గన్ పార్క్ కు చేరుకున్నారు.
Harish Rao Resignation letter:బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తన రాజీనామాతో శుక్రవారం ఉదయం గన్ పార్క్ కు చేరుకున్నారు. ఆగస్టు 15 లోగా రైతు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై హరీశ్ రావు స్పందిస్తూ.. ఈ హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరాు. ఈ ఛాలెంజ్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని తిరగాలంటూ హరీశ్ రావుకు సూచించారు. ఈ విషయంపై గన్ పార్కు వద్ద తేల్చుకుందాం, రాజీనామా లేఖతో రావాలని హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తన రాజీనామా పత్రంతో హరీశ్ రావు గన్ పార్క్ చేరుకున్నారు.
రాజీనామా లేఖను...
ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. మాజీ మంత్రికి మద్దతుగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు పూలతో నివాళులు అర్పించారు. అనంతరం తన రాజీనామా లేఖను స్థూపం ముందుంచారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో 144 సెక్షన్ అమలులో ఉందని, నిబంధనల ప్రకారమే తాము ఐదుగురమే ఇక్కడ ఉన్నామని హరీశ్ రావు చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హరీశ్ రావు సవాల్ ను స్వీకరించి రాజీనామా పత్రంతో గన్ పార్క్ వద్దకు వచ్చానని హరీశ్ రావు చెప్పారు. తన రాజీనామా లేఖను అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు అందజేసి హరీశ్ రావు వెళ్లిపోయారు.
Next Story