Sun Nov 24 2024 20:42:31 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్‌ను యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. శనివారం సాయంత్రం ఆసుపత్రి వర్గాలు రెండో రోజు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయనను వైద్య బృందం నిత్యం పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బెడ్ మీద నుంచి లేచి తిరుగుతున్నారని, ఆర్థోపెడిక్, ఫిజియోథెరఫీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ నడుస్తున్నారన్నారు. ఆయన ఆరోగ్య పురోగతి పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ రోజంతా ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపారు.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆకాంక్షించారు. ఈ మేరకు కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆయన లేఖ రాశారు. కేసీఆర్ త్వరగా కోలుకొని రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలన్నారు రామోజీరావు. నాన్నగారు ప్రమాదవశాత్తూ జారిపడి క్షతగాత్రులయ్యారని తెలిసి నాకు కలిగిన బాధను మీతో పంచుకోకుండా ఉండలేకపోయాను. తుంటి మార్పిడి కోసం ఆయనకు జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందన్న వార్త ముదావహం. తన వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని సాఫల్యం పొందిన ఆయన ఈ సవాలును అవలీలగా అధిగమిస్తారన్నారు రామోజీరావు.
Next Story