Mon Mar 31 2025 11:30:33 GMT+0000 (Coordinated Universal Time)
KTR : రేవంత్ దావోస్ పర్యటనపై కేటీఆర్ సెటైర్లు.. ఏశేశారుగా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ సెటైర్లు వేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి మూడు రోజుల నుంచి దావోస్ లో పర్యటిస్తున్నారు. ఆయన అనేక సంస్థల ప్రతినిధులతో చర్చించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. పెట్టుబడులు వస్తున్నాయన్న వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేటీఆర్ సెటైర్లు వేశారు. మేఘా, స్కైరూట్ ఏరోస్పేస్, కంట్రోల్ఎస్ వంటి పలు కంపెనీలతో వేల కోట్ల ఒప్పందాలు జరిగాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ తన ట్వీట్ తో అందరినీ కట్టిపడేసేలా చేశారు.
ట్వీట్ ఇలా...
హైదరాబాద్ ఆధారిత కంపెనీలను దావోస్ తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకోవటమేంటని అన్నారు. రేవంత్ సర్కార్ ఇన్నోవేటివ్ ఆలోచన, పాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. 'వినూత్న ఆలోచన అంటే ఏమిటి ? హైదరాబాద్ ఆధారిత కంపెనీలను స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కి వేల మైళ్ల దూరం ప్రయాణించి పెట్టుబడులు ప్రకటించేలా చేయడం! నిజంగా సర్కస్‌లా ఉంది. హైదరాబాద్‌లో చాయ్ తాగుతూ పూర్తి చేయాల్సిన ఒప్పందాలను.. స్విట్జర్లాండ్‌లో హాట్ చాక్లెట్‌తో పూర్తి చేయాల్సి వచ్చింది.' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Next Story