Sun Dec 22 2024 18:37:14 GMT+0000 (Coordinated Universal Time)
డేట్, టైమ్ ఫిక్స్ చేయమంటున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు సవాల్ విసిరారు. కరీంనగర్కు ఎవరేం చేశారో చర్చించడానికి సిద్ధమని.. డేట్, టైమ్ నువ్వే ఫిక్స్ చేయాలని అన్నారు. ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్ అని.. వినోద్ కుమార్ చర్చకు వస్తారని తెలిపారు. బండి సంజయ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదని.. కరీంనగర్ నుంచి ఆయన అడ్డిమారి గుడ్డిదెబ్బగా గెలిచారన్నారు. గత పదేళ్లలో అయిదేళ్ళు వినోద్ కుమార్, మరో అయిదేళ్లు బండి సంజయ్ ఎంపీలుగా ఉన్నారని... ఎవరేం చేశారో చూద్దామని అన్నారు.
కేసీఆర్ను తిట్టడం.. సొల్లు చెప్పడం తప్ప ఏమైనా చేశావా? అని బండి సంజయ్ ను ప్రశ్నించారు. ఓ ఎంపీగా ప్రధాని మోదీని పట్టుకొని ఈ పని చేశానని చెప్పే దమ్ముందా అని అన్నారు. ఇకమంత్రి పొన్నం ప్రభాకర్పై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశం కోసం.. ధర్మం కోసం అని చెప్తున్నప్పుడు మఠం పెట్టుకోవాలని సూచించారు. ఈ సంవత్సరమంతా ఎన్నికలే ఉంటాయని, పార్లమెంట్ ఎన్నికలు పూర్తవగానే పంచాయతీ, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ ఎన్నికలు ఉంటాయని కార్యకర్తలకు తెలిపారు కేటీఆర్. అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మాదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అందరికీ మాట ఇస్తున్నానన్నారు.
Next Story