Mon Dec 23 2024 04:03:14 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసు కస్టడీలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి
వికారాబాద్ కలెక్టర్ దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితరులపై లగ్గచెర్లలో దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని బుధవారం ఫిలింనగర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వికారాబాద్ కలెక్టర్ దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్ పై లగచర్ల గ్రామస్తుల చేసిన దాడి వెనుక ఆయన కుట్ర పన్నినట్లు అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న బీఆర్ఎస్ నేత సురేశ్ నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్లు గుర్తించారు. బోగమోని సురేష్ ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. కాల్ డేటా ఆధారంగా పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు.
Next Story