Mon Dec 23 2024 15:19:47 GMT+0000 (Coordinated Universal Time)
నాకు సన్మానం చేయాల్సిందే అంటూ బూతులు తిట్టిన బీఆర్ఎస్ నేత
గడ్డం శ్రీనివాస్ యాదవ్ జూలై 1వ తేదీ మధ్యాహ్నం 12:45 గంటలకు వీసీ కార్యాలయంలోకి ప్రవేశించాడు. విద్యార్థినులకు ఉచిత విద్య,
గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోఠి మహిళా విశ్వవిద్యాలయం వీసీ విజ్జులత.. ఫిర్యాదు చేయడంతో గడ్డం శ్రీనివాస్ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను దుర్భాషలాడారని సుల్తాన్ బజార్ పోలీసుకు విజ్జులత ఫిర్యాదు చేశారు.
నిందితుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ జూలై 1వ తేదీ మధ్యాహ్నం 12:45 గంటలకు వీసీ కార్యాలయంలోకి ప్రవేశించాడు. విద్యార్థినులకు ఉచిత విద్య, ఉపకార వేతనాలు అందజేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తనను ఘనంగా సత్కరించాలని వీసీని కోరాడు. తాను సోషల్ వర్కర్ నంటూ.. బాలికలకు ఉచిత విద్య, స్కాలర్ షిప్ లను అందిస్తున్నట్లు వీసీ విజ్జులతకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తనకు సన్మానం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు చెప్పుకొచ్చాడు. అయితే.. మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆర్థికంగా సహకారం అందించాలని వీసీ విజ్జులత కోరారు.తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయంలో ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉన్న కొంతమంది విద్యార్థులకు చేయూత అందించాలని కోరారు. ఇది తమ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని, వారు సత్కరించడానికి సిద్ధంగా ఉంటారని ఆమె అతనికి చెప్పారు. ఆ డిమాండ్ బీఆర్ఎస్ నాయకుడికి కోపం తెప్పించింది. తాను గోషామహల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థినంటూ వీసీతో దూకుడుగా ప్రవర్తించాడు. ‘‘నువ్వు ఏమైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారిని అనుకుంటున్నవా..? వీసీ అయ్యాక నీ కళ్లు నెత్తికెక్కాయి’’ అంటూ వీసీపై దుర్భాషలాడాడు శ్రీనివాస్ యాదవ్. ఆఫీసు నుండి బయటకు కూడా అతడు వెళ్ళలేదు. దీంతో గడ్డం శ్రీనివాస్ యాదవ్ పై వీసీ విజ్జులత సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం పోలీసులు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చారు.
Next Story