Sat Dec 21 2024 01:52:16 GMT+0000 (Coordinated Universal Time)
BRS : మంత్రి పొన్నంపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు.. కోట్లు సంపాదిస్తున్నారంటూ?
ఎన్టీపీసీ లో ఉన్న ఫ్లై యాష్ తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
రామగుండం ఎన్టీపీసీ లో ఉన్న ఫ్లై యాష్ తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి ,కె .పి వివేకానంద ,డాక్టర్ కె .సంజయ్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఓ లారీ లో 32 టన్నులు ఫ్లై యాష్ తరలించాల్సి ఉంటె 72 టన్నులు తరలిస్తున్నారన్నారు. వే బిల్లుల్లోఎన్ని టన్నులు అని పేర్కొనడం లేదరిచ అదనంగా రొజూ తరలిస్తున్న ఫ్లై యాష్ కు 50 లక్షల రూపాయల లు అక్రమంగా సంపాదిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ డబ్బులు పొన్నం ప్రభాకర్ అన్న కుమారుడు అనూప్ వసూల్ చేస్తున్నారని, ఓవర్ లోడ్ తో వెళ్తున్న 13 లారీ లను ీనే స్వయంగా పట్టుకున్నానని కౌశిక్ రెడ్డి తెలిపారు.
యాష్ లారీలను...
కేవలం రెండు లారీలను సీజ్ చేసి రవాణా శాఖ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఒత్తిళ్లకు రవాణా శాఖ అధికారులు లొంగుతున్నారన్నారు. ఆధికారులు తమ భాద్యతలు తాము నిర్వర్తించాలని, తాను లారీలు పట్టుకుంటున్నానని హుస్నాబాద్ మీదుగా తరలిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పొన్నం ఎక్కడ్నుంచి తరలించినా బీ ఆర్ ఎస్ కార్యకర్తలు పట్టుకుంటారన్నారు. ఫ్లై యాష్ లారీ లతో రోడ్డు ప్రమాదాలు కూడా జరగుతున్నాయని, ఇంజనీరింగ్ విద్యార్ధి అఖిల్ ను ఫ్లై యాష్ లారి బలి తీసుకుందని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో ఓవర్ లోడ్ లారీ ల దందా ఆపకపోతే తమ కేడర్ ప్రత్యక్ష కార్యాచరణ కు దిగుతుందని హెచ్చరించారు.
Next Story