Thu Apr 03 2025 22:12:55 GMT+0000 (Coordinated Universal Time)
BRS : నేడు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహా ధర్నా
బీఆర్ఎస్ నేతలు నేడు మహబూబాబాద్ లో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు

బీఆర్ఎస్ నేతలు నేడు మహబూబాబాద్ లో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది. లగచర్లలో దళిత, గిరిజనులపై ప్రభుత్వం అనుసరించిన వైఖరికి నిరసనగా ఈరోజు మహా ధర్నాను నిర్వహిస్తుంది. న్యాయస్థానం అనుమతితో ఈ ధర్నాను బీఆర్ఎస్ నేతలు చేపట్టారు. ఈ మహా ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ ధర్నా ను నిర్వహించనున్నారు.
బయలుదేరిన కేటీఆర్...
ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి మరికాసేపట్లో మహబూబాబాద్ కు చేరుకుంటారు. బీఆర్ఎస్ నేతలు మహాధర్నాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పెద్దయెత్తున బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు, దళితులను, గిరిజనులను కూడా సమీకరించారు.
Next Story