Mon Dec 23 2024 19:37:48 GMT+0000 (Coordinated Universal Time)
BRS : రేవంత్ ను ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు చీఫ్ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. ఆయన గత కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తెలిపారు. ఆయనను ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని కోరారు. ఇటీవల దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, తాజాగా అచ్చంపేట అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడులు ఇందులో భాగమేనని వారు వికాస్ రాజ్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆయన ప్రసంగాలు కోరుతున్నారన్నారు.
సీఈసీని కలసిన బీఆర్ఎస్ నేతలు...
అలాగే ఎన్నికల ప్రకటనలు కొన్ని నిషేధించాలని కూడా గతంలో ఆదేశించినా అవి కొనసాగుతున్నాయని వికాస్ రాజ్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం వల్ల ఉద్రిక్తతలు పెరిగిపోతాయని వారు తెలిపారు. బీఆర్ఎస్ ను కించపర్చేవిధంగా వస్తున్న టీవీ యాడ్స్ పై కూడా చర్యలు తీసుకోవాలని, అవి ఇంకా వస్తున్నాయని వారు వికాస్ రాజ్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story