Mon Dec 23 2024 08:10:10 GMT+0000 (Coordinated Universal Time)
ఆ పదవులకు బీఆర్ఎస్ నేతల రాజీనామా
బీఆర్ఎస్ పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామాలకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ ఛాంబర్లో కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కారణంగా వీరంతా తమ ఎమ్మెల్సీ పదవులకు వారు రాజీనామా చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి.. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిల రాజీనామాలకు ఆమోదం తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ తమ ఎల్పీ నేతను శనివారం ఉదయం ఎన్నుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా శాసన సభా సమావేశాల కంటే ముందే పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ సీఎం కేసీఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. అలాగే శాసనసభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే భాద్యతను కేసీఆర్ కు అప్పగించారు. ఈ మేరకు సభ్యులంతా ఏకగీవ్రంగా తీర్మానం చేసి ఆమోదించారు.
Next Story