Mon Dec 23 2024 18:52:47 GMT+0000 (Coordinated Universal Time)
ఈ కుట్రలు ఇక ఆపండి.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం
ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయని, బీజేపీ ఇందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ నేతలు అన్నారు
ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయని, బీజేపీ ఇందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజే కేసులో బీజేపీ నేతలున్నారన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కూడా బీజేపీ నేతల హస్తం ఉందని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. వరంగల్లో నిన్న పేపర్ లీక్ చేసిన ప్రశాంత్ బీజేపీ కార్కకర్త అని ఆయన ఆరోపించారు. బండి సంజయ్కు ప్రశాంత్ ముఖ్య అనుచరుడని తెలిపారు.
ప్రభుత్వాన్ని చులకన చేసేందుకే...
కేవలం ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేసేందుకు ఇలాంటి నీచమైన పనులకు దిగుతున్నారని బాల్క సుమన్ అన్నారు. దమ్ముంటే బీఆర్ఎస్ ను బీజేపీ నేతలు ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనాలని, ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతూ విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుకోవడం సరికాదని హితవు పలికారు. అన్ని ప్రశ్నాపత్రాల లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని బాల్కసుమన్ డిమాండ్ చేశారు.
- Tags
- balka suman
- bjp
Next Story