Mon Dec 23 2024 06:55:17 GMT+0000 (Coordinated Universal Time)
రేపు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
ఈ నెల 17న బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు
ఈ నెల 17న బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలను దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం అజెండాను కూడా రూపొందించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు
ఎన్నికల వ్యూహంపై...
కర్ణాటక ఫలితాల అనంతరం జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ సిద్ధం చేయనున్నారు. శాసనసభ్యులతో పాటు పార్లమెంటు సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
Next Story