తెలంగాణ ఎన్నికలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ఆధారపడి ఉందన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తర్వాతే తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే క్లారిటీ వస్తుందని అన్నారు. తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాలంటే అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయన్నారు. లేదంటే కష్టమే అని అన్నారు. ఏప్రిల్ లేదా మే నెలలో తెలంగాణ ఎన్నికలు జరగొచ్చని.. అయితే ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ అయిపోతేనే తెలంగాణ ఎన్నికలపై క్లారిటీ వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై ప్రధాని మోదీ బయపడుతున్నాడని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే..ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని అనుకుంటున్నారని.. అందుకే 5 రాష్ట్రాల ఎన్నికలను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో మాత్రమే బీజేపీ కి అవకాశం ఉందన్నారు. మిగతా రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం కష్టమే అని అన్నారు.