Mon Dec 23 2024 04:18:36 GMT+0000 (Coordinated Universal Time)
BRS : పదోతేదీన భారీ బహిరంగ సభ.. లక్షల మందితో
ఈ నెల పదో తేదీన సిద్దిపేటలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు.
ఈ నెల పదో తేదీన సిద్దిపేటలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఈ నెల పదో తేదితో కేసీఆర్ ప్రచారం ముగియనుంది. గత నెల 24వ తేదీన బస్సు యాత్రతో బయలుదేరిన కేసీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తుననారు.
ముగింపు సందర్భంగా...
అయితే ముగింపు సభగా సిద్ధిపేటలో భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. అదే రోజు బస్సు యాత్ర కూడా ముగియనుండటంతో లక్ష మందితో బహిరంగ సభను నిర్వహించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు సిద్దిపేట సభకు కదలి రావాలంటూ ఆయన పిలుపు నిచ్చారు. ఈరోజు రోజు సిద్దిపేటలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను హరీశ్ రావు పరిశీలించారు.
Next Story