Sun Dec 14 2025 23:17:38 GMT+0000 (Coordinated Universal Time)
Harsh Rao : హరీశ్ ట్వీట్ లో ఏమన్నారంటే? పండగ ఎందుకు దండగ అంటూ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ లో ట్వీట్ చేశారు. రైతులను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ లో ట్వీట్ చేశారు. రైతు పండగ ఎందుకు దండగ అంటూ ఆయన ట్వీట్ చేశారు. రైతు భరోసా ను పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతు భరోసా ఇప్పటి వరకూ ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆయన అన్నారు. రైతులకు వరి బోనసై దక్కిన బోనస్ ఇప్పటికి ఇరవై కోట్లు మాత్రమే అందిందని కూడా హరీశ్ రావు తెలిపారు.
పాలమూరులో ప్రకటన చేయాల్సిందే...
రైతు బంధుకు ఏడాదికి 7,500 కోట్లు జమ చేయాల్సి ఉండగా, ఎకరాకు పదిహేను వేల రూపాయలు చెల్లిస్తే చాలా ఎక్కువ అవుతుందని ఆయన అన్నారు. రైతు బంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు చేకూర్చడం ఎలా అవుతుందో చెప్పాలంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. రైతులను భరోసా ఇస్తామని మోసం చేశారన్న హరీశ్ రావు రైతులను నిలువునా ఈ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. రైతులను మోసగించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పండగ చేసుకోవడమేంటని హరీశ్ రావు ప్రశ్నించారు. పాలమూరులో రైతు బంధుపై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు
Next Story

