Thu Dec 19 2024 15:17:52 GMT+0000 (Coordinated Universal Time)
Padi Kaushik Reddy: పోలీసుల అదుపులో అరికెపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డి మరో సవాల్
అరికెపూడి బీఆర్ఎస్లోనే కొనసాగుతుంటే తెలంగాణ భవన్‌కు రావాలని
తెలంగాణ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి, అరికెపూడి మధ్య మాటల యుద్ధం తీవ్రమైన సంగతి తెలిసిందే. చివరికి అరికెపూడి కౌశిక్ ఇంటి వద్దకు వెళ్లారు. అరికెపూడి గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసి కిటికీ అద్దాలు పగలగొట్టారు. పోలీసులు అడ్డుకుంటున్నా కూడా ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నం చేశారు. కేసీఆర్ మాట్లాడితే సమాధానం చెబుతా కానీ తాను కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు అరికెపూడి. రాళ్లు, గుడ్లు, టమోటాలతో అరికెపూడి గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, పూలకుండీలు ధ్వంసం అయ్యాయి. కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద అరికెపూడి గాంధీ అనుచరులు భారీ ఎత్తున బైఠాయించారు.
అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే కొనసాగుతుంటే తెలంగాణ భవన్‌కు రావాలని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరుతారని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీ భవన్‌కు వస్తే, ఇద్దరం కలిసి కేసీఆర్ వద్దకు వెళ్తామని... అలా రాకుంటే మాత్రం కాంగ్రెస్‌లో చేరినందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మాత్రం బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారని, అందుకే ఆయన ఇంటికి వెళ్తున్నామన్నారు. ఆయనను సాదరంగా కేసీఆర్ ఇంటికి తీసుకువెళ్తామన్నారు. తాను బీఆర్ఎస్లో చేరినప్పుడు తనతో పాటు పదిమందిని తీసుకెళ్లినట్లు గాంధీ చెబుతున్నారని, కానీ ఆరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఐదుగురు ఎమ్మెల్యేలే అని అన్నారు. అరికెపూడి గాంధీకి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
Next Story