Tue Dec 24 2024 01:37:15 GMT+0000 (Coordinated Universal Time)
BRS : మూసీ నదీ పరివాహక ప్రాంతానికి నేడు బీఆర్ఎస్ నేతలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు మూసీ నదీ పరివాహక ప్రాంత ప్రజల వద్దకు వెళుతున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు మూసీ నదీ పరివాహక ప్రాంత ప్రజల వద్దకు వెళుతున్నారు. అందరూ కలసి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు. వారి నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకుంటారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు చేరుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కలసి బాధితులతో మాట్లాడేందుకు వెళ్లనున్నారు.
వారికి అండగా నిలిచి...
మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను కూల్చివేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆక్రమించుకుని ఇళ్లను కట్టుకున్న వారి ఇళ్లకు నోటీసులు అందచేశారు. దీంతో బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ సిద్ధమయింది. వారికి న్యాయపరమైన సలహాలను అందించడమే కాకుండా వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంది.
Next Story