Mon Dec 23 2024 05:40:12 GMT+0000 (Coordinated Universal Time)
Congress : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ చేయడానికి ఇంకా ఉన్నారట.. రేపు జాయినింగ్స్?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈరోజు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రేపు నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమచారం మేరకు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి...
నలుగురు కంటే ఎక్కువ సంఖ్యలో కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రేపు చేరతారంటున్నారు. అయితే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం కూడా చర్చనీయాంశమైంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు హాజరు కావాలని అధినాయకత్వం ఆదేశించినా కౌన్సిల్ సమావేశానికి సబిత ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డిలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Next Story