Sun Dec 22 2024 23:15:33 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : స్పీకర్ ను కలసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావును కలిశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావును కలిశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మరో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ను కలసి పార్టీ మారిన వాళ్లందరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు.
ప్రొటోకాల్....
దీంతో పాటు నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించి ప్రొటోకాల్ ను సక్రమంగా పాటించడం లేదని, ప్రొటోకాల్ ను పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా మొత్తం 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసిన వారిలో ఉన్నారు. మరో 14 మంది స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు దూరంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Next Story