Sun Mar 02 2025 22:26:01 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ సర్కార్ పై కవిత సెటైర్లు పేలాయిగా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తుందని అన్నారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బురదరాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడిందన్న కవిత కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలని కవిత కోరారు.
రాష్ట్ర ప్రయోజనాలను...
రాజకీయాలకు అతీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజనీతజ్ఞతను ప్రదర్శించాలని, వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్య శ్రీని కేసీఆర్ కొనసాగించారని, కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోందని కవిత అన్నారు. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలని, సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్ లా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ శతృవు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని, కానీ మన జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులు మన శతృవులని ఆయన గమనించాలని కోరారు.
Next Story