Sun Dec 22 2024 13:05:44 GMT+0000 (Coordinated Universal Time)
ఐదున్నర నెలల తర్వాత కవిత సొంత ఇంటికి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొద్డిసేపటి క్రితం చేరుకున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొద్డిసేపటి క్రితం చేరుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన కవితకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఐదునెలల పాటు తీహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవితకు నిన్న సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
భారీ స్వాగతం...
ఆమె నేరుగా తన ఇంటికి చేరుకున్నారు. ఆమెకు ఇంటివద్ద గుమ్మడి కాయలను దిష్టి తీసి లోపలికి అడుగు పెట్టేందుకు కార్యకర్తలు పెద్దయెత్తున తరలి వచ్చారు. కల్వకుంట్ల కవిత ఈ ఏడాది మార్చి 15వ తేదీన అరెస్ట్ కావడంతో ఆమె సొంత ఇంటికి ఐదున్నర నెలల తర్వాత వచ్చినట్లయింది. రేపు ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ కు వెళతారని, కేసీఆర్ ను కలుసుకుంటారని చెబుతున్నారు.
Next Story