Tue Jan 07 2025 21:51:17 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టుకు కవిత
రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు
రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళ విచారణ ఈడీ కార్యాలయంలో చట్ట విరుద్ధమంటూ కవిత తన పిటీషన్ లో పేర్కొన్నారు. మహిళలను తమ ఇళ్లవద్దనే విచారించాలన్న నిబంధనలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తుంగలో తొక్కుతున్నారని కల్వకుంట్ల కవిత తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈడీ విచారణపై స్టే ఇవ్వాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ పిటీషన్ విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
రేపు విచారణ...
కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఒకసారి విచారణ చేశారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమెను తొమ్మిదన్నర గంటలకు పైగా విచారణ జరిపారు. రేపు మరోసారి ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈసారి కవితను ఎవరితో కలిపి ప్రశ్నిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకూ విచారణను ఎదుర్కొంటానన్న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
Next Story